జిల్లా గురించి
యాదాద్రి భువనగిరి జిల్లా పూర్వపు నల్గొండ జిల్లా నుండి వ్యవస్థీకరించబడినది.ఈ జిల్లా నల్గొండ, సూర్యాపేట, జనగాం , సిద్దిపేట, మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటుంది. జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి – భువనగిరి మరియు చౌటుప్పల్. జిల్లా ప్రధాన కార్యాలయం భువనగిరి పట్టణంలో ఉంది, ఇది ఈ ప్రాంతంలోని ప్రముఖ వ్యాపార కేంద్రం.